పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు.
మరోవైపు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్ టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ వారు చేజక్కించుకున్నారు.