పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జాగర్ల క్రిష్ దర్శకత్వంలో శ్రీసూర్యా మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.
భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రం నుంచి త్వరలో బిగ్ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్ర బృందం నుంచి విడుదలైన పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుతున్నాయి. అయితే, ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై డైరెక్టర్ క్రిష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజానికి వీరమల్లు సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా..ఇటీవల పవన్ రాజకీయాల్లో బిజీ అవటంవల్ల ఆలస్యం అవుతోంది.
ఈ సినిమాను వేసవిలో విడుదల చేసే ఆలోచనలో మూవీ టీం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.