హైదరాబాద్: ఈటల రాజేందర్ -హరీష్ మధ్య బంధం అందరికి తెలిసిందే. వారిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇంకా చెప్పాలంటే హరీష్‌కు ఈటల ముఖ్య అనుచరుడు. ఈటల మీద అవినీతి ఆరోపణల ప్రచారం జరగడం, ఈటల ధిక్కార స్వరం వినిపించడం టీఆర్ఎస్ నేతకు కాస్త ఇబ్బంది కలిగించింది. మరోపక్క బీజేపీ నేతలు అక్టోబర్ లో టీఆర్ఎస్‌ను చీలుస్తామని బెదిరిస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉన్నగవర్నర్ నర్సింహన్‌ను బీజేపీ నేతలు సాగనంపారు. ఢిల్లీలో ఎంతో కొంత మధ్యవర్తిత్వం చేసే విద్యాసాగర్‌రావును కూడా ముంబాయి నుంచి ఖాళీ చేయించారు. ఈ ప్రతికూల పరిస్థితే మధ్య హరీష్‌ను దూరంగా ఉంచడం సరైన చర్య కాదని సారు భావించారట.
ఇక మంత్రి పదవిని చేపట్టడానికి కేటీఆర్ కూడా కాస్త ఇబ్బంది పడ్డారట. హరీష్‌కు కూడా పదవి ఇవ్వకపోతే ప్రజలేమనుకుంటారని ప్రశ్నించారట. ఇది కూడా హరీష్ పదవికి కారణం కావచ్చు.
అయితే ప్రస్తుతం పెద్దగా పనిలేని ఆర్ధికశాఖను హరీష్‌కు కట్టబెట్టారని ఆయన అనుచరులు కాస్త బాధపడుతున్నట్టు తెలుస్తోంది.