హైదరాబాద్: ప్రమాణ స్వీకాణం చేసిన ఆరుగురు మంత్రులుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే శాఖలను కేటాయించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. కీలకమైన విద్యాశాఖను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దక్కించుకున్నారు. ఆదివారం సాయంత్రం హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొద్ది సమయంలోనే వారందరికీ శాఖలను కేటాయించారు.
మంత్రుల శాఖలు ఇవే..
కేటీఆర్: ఐటీ, మున్సిపల్, మైనింగ్, పరిశ్రమలు
హరీష్ రావు: ఆర్థిక శాఖ
సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ
గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాలు
సత్యవతి రాథోడ్: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ
పువ్వాడ అజయ్ కుమార్: రవాణా శాఖ