దేశంలో 20 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండగా.. అభివృద్ధిలో మాత్రం వాటికంటే తెలంగాణ ముందున్నదన్నారు మంత్రి తన్నీరు హరీష్రావు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తున్నదని మంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన రూ.130 కోట్ల బీఆర్‌జీఎఫ్ నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇరిగేషన్ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మాగారానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు.. సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుంటే బీజేపీ ఓర్వలేకపోతున్నదని హరీష్ రావు మండిపడ్డారు. 2 నుంచి 3వేల కోట్లు ఖర్చు అయిన ప్రతి రైతు నుంచి చివరి వండ్ల గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఇక కాంగ్రెస్నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని.. ఏం చూసి ఆ పార్టీకి ఓట్లు వేయాలని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. కానీ.. ఇప్పడు ఏమైందని మంత్రి ప్రశ్నించారు.