ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2.51 కోట్ల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ 2 టీకాలు వేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఇంకా 80 లక్షల వాక్సిన్లు స్టాక్ ఉన్నాయి. ఓటు కోసం వచ్చినట్టు.. ఇంటింటికి వచ్చి వాక్సిన్ వేయిస్తాం. ప్రజలు సహకరించాలని కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు.. కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం ఏం లేదన్నారు హరీష్ రావు.