తెలంగాణ వాసులను ఒమిక్రాన్ భయం వెంటాడుతుండడంతో మంత్రి హరీష్ రావు స్పందించారు. ఒమిక్రాన్ వల్ల ప్రాణభయం లేదని.. ప్రజలు ఎవరూ ఆందోళన పడొద్దని సూచించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరీక్షలు పెంచుతామన్న ఆయన.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని తెలిపారు.
తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తయిందన్నారు హరీష్ రావు. అలాగే రెండు డోసుల పంపిణీ 64 శాతం అయిందని వివరించారు. బూస్టర్ డోసుపై కేంద్రాన్ని కోరామన్న ఆయన… కరోనా పరీక్షలు పెంచాలని సీఎం సూచించినట్లు చెప్పారు.