పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా భీమ్లా నాయక్ సెట్ లో హరీష్ శంకర్ దర్శనమిచ్చారు. అలాగే హరీష్ తో పాటు మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవి కూడా కనిపించారు.
భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి పవన్ తో చర్చలు జరిపారు హరీష్ శంకర్. అలాగే పవన్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
త్వరలోనే యాక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Had an amazing time and energetic conversations ….. we are gearing up guys …. Let’s get into action soon @MythriOfficial @ThisIsDSP @DoP_Bose #BB pic.twitter.com/oql9jKx73W
— Harish Shankar .S (@harish2you) February 12, 2022
Advertisements