పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి క్రిష్‌తో చేస్తున్న హరి హర వీర మల్లు, హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డిలతో చేయబోయే సినిమాపై ఉంది.
అయితే అందులో భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. తాజాగా పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సెట్ మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ లో ‘అబ్బాయిలు ఈ ఫోటో ను గుర్తుంచుకోండి… సమయం దొరికినప్పుడు ఈ ఉత్తేజకరమైన సంభాషణను పంచుకుంటాను!!!! #BhavadeeyuduBhagatSingh ఫుల్లీ లోడెడ్ అంటూ చెప్పు కొచ్చాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. ఇక విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
Guys remember this pic … will share this exciting conversation when time permits !!!! #BhavadeeyuduBhagatSingh
Fully loaded
mallee Loaded 👍👍 pic.twitter.com/wS604rEICt— Harish Shankar .S (@harish2you) March 2, 2022
Advertisements