కేంద్ర ప్రభుత్వంపై సంచలన వాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. ఆర్థికమంత్రి హోదాలో జహీరాబాద్ నియోజవకర్గం కోహిర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో పర్యటిస్తున్న మంత్రి హరీష్, అక్కడ 33/11కె.వి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అయితే, అక్కడ ప్రసంగించే క్రమంలో… ప్రస్తుతం ప్రపంచం, దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉందని… నిధులకు తీవ్ర సమస్యలు ఎదురువుతున్నాయారు. అయితే, మరో అడుగు ముందుకెసి… కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా రావటం లేదు. అయినా… మేం వెనకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అయితే, సాయంత్రం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే సమయంలో… హరీష్ వాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్రం నుండి నిధులు రావటం లేదంటూ ఓవైపు విమర్శలు చేస్తూనే, మరోవైపు ప్రధానిని ఎలా నిధులు కేటాయించమని కోరుతారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ నేతల మాటలకు, చేతలకు పొంతనుండదని మరోసారి రుజువైందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే… రైతులు, సంక్షేమానికి ఎలాంటి ఢోకా లేకుండా, మాంధ్యం ప్రభావం పడకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రభత్వం… చెరుకు రైతుల బకాయిల విషయంలో వాయిదా పద్దతుల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్‌రావు. ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్న 21కోట్లలో ప్రస్తుతం 10 కోట్లు విడుదల చేస్తామని, మిగిలిన 11 కోట్లు 15రోజుల వరకు చెల్లిస్తామని చెప్పటం గమనార్హం. ఇప్పుడే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఆపం అని చెప్తూనే… చెరుకు రైతుల బకాయిలపై వాయిదా పద్దతి పెట్టడం ఏంటీ…? అని విమర్శలు వినపడుతున్నాయి.