భారత మహిళా క్రికెట్ జట్టు ఈ నెలలో శ్రీలంకలో పర్యటించనున్నది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆమె స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ కు కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.
దీంతో టీ20లతో పాటు అదనంగా వన్డే జట్టుకు ఆమె కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కాగా శ్రీలంకలో పర్యటించే భారత జట్టు 3 టీ20, 2 వన్డే మ్యాచ్ లు ఆడనుంది.
తాజా జట్టులో వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామికి చోటు దక్కలేదు. రోడ్రిగ్స్, రాధా యాదవ్‌కు టి20ల్లో అవకాశం ఇవ్వగా, హర్లిన్, తానియా భాటియాకు వన్డేల్లో చోటు దక్కింది. మిగతా సభ్యులందరూ టి20, వన్డేలో స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), షెఫాలీ, మంధాన, మేఘనా, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, యాస్తికా భాటియా, సిమ్రన్ బహదూర్, వస్త్రాకర్, రిచా ఘోష్, మేఘనా సింగ్, తానియా భాటియా, రేణుకా సింగ్, హర్లీన్ డియోల్.
టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్(కెప్టెన్), షెఫాలీ వర్మ, మంధాన,యాస్తికా భాటియా, దీప్తి శర్మ, మేఘనా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, రిచా ఘోష్, సిమ్రన్ బహదూర్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, మేఘనా సింగ్, జెమీమా రోడ్రిగెజ్, రాధా యాదవ్