ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్ధులు సంఘీభావం తెలిపారు. విద్యార్ధులపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ 100 మందికి పైగా హార్వర్డ్ విద్యార్ధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్ధులపై పోలీసులు హింసాత్మక అణిచివేతకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. పౌరసత్వ చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలు, అసమ్మతులు ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.
శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధులపై పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్, భౌతికంగా దాడి చేయడం,యూనివర్సిటీ క్యాంపస్ లోకి బలవంతంగా ప్రవేశించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల దాష్టీకంపై మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోలు కలచి వేశాయని హార్వర్డ్ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.