మునిగిపోతున్న నావలా తయారవుతోన్న కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీజేపీకి ఆరెస్సెస్‌లా కాంగ్రెస్ కూడా పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించగా, తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంది.
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులకు కొన్ని షరతులు విధిస్తూ రాష్ట్ర పార్టీ చీఫ్ ట్వీట్ చేశారు. వాటి ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు మద్యం సేవించరాదు. ఖాదీ దుస్తులను ధరించటంతో పాటు పార్టీ నినాదమైన లౌకికవాదాన్ని విశ్వసిస్తూ, కుల-మత-జాతి విద్వేషపూరిత వాఖ్యలు చేయనంటూ హమీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారి సామాజిక వర్గాలను బట్టి కొంతమేర ఫీజులను వసూలు చేయాలని డిసైడ్ చేసింది. హర్యానాలో 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ గత ఎన్నికల్లో భారీ విక్టరీ నమోదుచేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈసారి హర్యానాలో మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉండబోతుంది.