దేశ రాజధానిని రైతుల ఉద్యమం కుదిపేస్తుంది. కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతన్నలు చలిలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ, చర్చలు జరుపుతున్నా రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఢిల్లీ సరిహద్దులోని పంజాబ్, హర్యానా బార్డర్ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో… ఈ సెగ హర్యానా ప్రభుత్వాన్ని తాకింది. హర్యానాలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడను ప్రశ్నిస్తుంది. హర్యానాలో బీజేపీ నేతృత్వంలో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో రైతులకు కనీస మద్ధతు ధర లభించకుంటే తను ఎన్డీఏ నుండి వైదొలుగుతామని, ప్రభుత్వం నుండి భయటకొచ్చేస్తామని హెచ్చరించారు.
కేంద్రం కూడా కనీస మద్ధతు ధర కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఒకవేళ అది నేరవేరకపోతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.