టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పుడు అతను జాతీయ హీరో అయిపోయాడు. ఈ క్రమంలో హర్యానా సర్కార్ అతడికి భారీ నజరానా ప్రకటించింది. పసిడి పతకం ముద్దాడిన నీరజ్ కు రూ.6 కోట్ల నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపింది.
ఇక నగదు బహుమతితో పాటు గ్రూప్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్. ఇక హర్యానా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పానిపట్ లో చోప్రా కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచారు.
हरियाणा सरकार द्वारा पंचकूला में 13 अगस्त को एक कार्यक्रम आयोजित कर ओलंपिक में मेडल जीतकर आने वाले हरियाणा के सभी खिलाड़ियों को पुरस्कार वितरित कर उन्हें सम्मानित किया जाएगा। pic.twitter.com/COaWMLpE4X
— CMO Haryana (@cmohry) August 7, 2021
Advertisements