హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల హౌస్ రెంట్ అలవెన్స్‌ను భారీగా పెంచింది. ఒక్కో మంత్రికి ఇంటి అద్దె అలవెన్స్ ను లక్షరూపాయలకు పెంచుతూ కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఒక్కో మంత్రికి రూ.50వేలున్న ఇంటి అద్దె అలవెన్స్ ను రూ.80వేలకు పెంచడంతోపాటు అదనంగా విద్యుత్, మంచినీటి సరఫరా చార్జీల కోసం మరో రూ.20వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్ణయించారు. మంత్రుల ఇంటి అద్దె అలవెన్స్ పెంచుతూ కేబినెట్ 10 ఏఏ రూల్ సవరణకు ఆమోదముద్ర వేసింది. మంత్రుల వేతనాలను 2016 ఏప్రిల్ 1వతేదీన పెంచినా హెచ్‌ఆర్ఏను మాత్రం 2011 జూన్ 2 నుంచి పెంచలేదు.