కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యంపై యావత్ దేశం ఆశలు పెట్టుకున్న వేళ.. ఆ టీకా పనితీరుపై కొత్త అనుమానం మొదలైంది. ట్రయల్స్ భాగంగా ఇటీవలే వాలంటీర్‌గా ముందుకొచ్చి కోవాగ్జిన్ వేయించుకున్న హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు. తాజా పరీక్షలో తనకు పాజిటివ్ తేలినట్లు ప్రకటించారు.
మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా అంబాలాలో గత నెల 20వ తేదీన అనిల్ విజ్.. కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. వాలంటీర్‌గా ముందుకొచ్చి వేయించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఈ వైరస్ బారినపడటతో కోవాగ్జిన్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.ఇటీవలే వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి.. సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు.