ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. వెతకని చోటు లేదు..వెతికినా కనపడలేదు. కరోనా కష్టకాలంలో ఆశలు వదులుకున్నారు. దాదాపు తొమ్మేదేళ్ళతరువాత ఆ కుంటుంబానికి ఓ వార్త తెలిసింది. ఆమెకోసం, ఆమె తోడుకోసం ఇన్నాళ్ళు ఎదురు చూసిన భర్త కన్నీళ్ళు పెట్టుకున్నాడు.కాకపోతే అవి గుండెలోతుల్లోంచి వచ్చిన కన్నీళ్ళు. ఆనందంతో పొంగుకు వచ్చిన కన్నీళ్ళు..! ఇది 50 యేళ్ళ ‘దర్శని’ కథ. అనుబంధాలకు ఆయువుపోసే కథ.
హరియాణాకు చెందిన కేహర్ సింగ్(55)…అతడి భార్య దర్శిని(50 ) ఢిల్లీలో నివాసం ఉండేవారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. దర్శనికి మానసిక సమస్యలు తలెత్తాయి. 2013లో తప్పిపోయింది.
తనభార్యకోసం ఢిల్లీతో బాటు పలుచోట్ల శక్తివంచన లేకుండా వెతికారు కుటుంబ సభ్యులు. ఫలితం లేదు. అయినా కొన్నేళ్ళైనా వెతుకుతూనే ఉంది కేహర్ కుటుంబం. దేశంలో కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ తదితర పరిణామాల అనంతరం ఈ ప్రయత్నాలు విరమించారు కెహర్. కరోనా వల్ల ఆమె చనిపోయి ఉండవచ్చని వారు భావించారు.
అయితే,ఒక రోజు కేహర్ సింగ్ కు ఫోన్ వచ్చింది.ఆవ్యక్తి దర్శిని బతికే ఉందని కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఆమె కనిపించిందని తెలిపాడు. వెంటనే కేహర్ కర్ణాటకకు బయల్దేరాడు. సుమారు 2.5 వేల కిలోమీటర్ల దూరాన ఉన్న భార్యకోసం కేహార్ కోటి ఆశలతో వెళ్ళాడు.
కొడగు చేరుకున్న కేహర్ భార్యదర్శనిని చూడగానే చలించిపోయాడు. తొమ్మిదేళ్ళతర్వాత దర్శనిని చూసేసరికి కన్నీళ్ళు గుండెలకు హత్తుకున్నాడు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఆనందాన్ని పంచుకున్నారు.
నాలుగేళ్ళక్రితం దర్శని కర్ణాటకలో కుషల్ నగర్ లో పోలీసులకు కనిపించింది. ఒంటిపై సరిగా దుస్తులు లేని ఆమెని మడికెరలోని తానల్ షెల్టర్ హోమ్ కు తరలించారు. తానల్ ఇనిస్టిట్యూట్ ను నడిపిస్తున్న మహ్మద్ అనే వ్యక్తి..దర్శిని బాగోగులు చూసుకున్నాడు. నాలుగేళ్ళుగా ఇక్కడే ఆమెకు మానసిక చికిత్స అందించారు. ఇటీవల దర్శిని తన స్వస్థలం గురించి సంస్థ సిబ్బందికి చెప్పింది. తన పేరు దర్శని అని ..ఊరు హరియాణా అని తెలిపింది. వెంటనే మహ్మద్ పోలీసులకు సమాచారమందించారు.
దీంతో ,మిస్సింగ్ లిస్ట్ లోని దర్శిని పేరు ఎక్కడైనా ఉందేమోనని తనిఖీ చేసి హరియాణా పోలీసులకు…కేహర్ గురించి తెలిసింది. వెంటనే అతడికి సమాచారం చేరవేశారు. కేహర్ తన దర్శని కోసం ఆశల రెక్కలు కట్టుకువచ్చాడు.