హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను మంత్రి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా అథ్లెట్ కోచ్ ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తనను మంత్రి తొలిసారి ఓ జిమ్ వద్ద కలిశాడని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఇన్ స్టాలో పదే పదే మెసేజ్‌లో చేసే వారని ఆమె అన్నారు. నేషనల్ సర్టిఫికెట్ పెండింగ్‌లో వుందని అందువల్ల తనను కలవాలని మంత్రి చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. దీంతో మంత్రి ఇంటికి వెళ్లానన్నారు.
కానీ అక్కడ మంత్రి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె తెలిపారు. దీనిపై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. గతంలో భారత జాతీయ హాకీ జట్టుకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గా ఆయనకు పేరుంది.
అందరూ ఆయన్ని ముద్దుగా ‘ఫ్లిక్కర్ సింగ్” అని పిలుస్తారు. 2008-09 సుల్తాన్ అజ్లాన్ షా కప్ లో టాప్ సాకర్ గా నిలిచాడు. ఆయన జీవిత కథతో సూర్మా అనే సినిమాను తీశారు. ఇది ఇలా వుంటే ఆరోపణల నేపథ్యంలో సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.