అదృష్టం కొన్ని సార్లు వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతోంది. కానీ.. ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెల్వదు. తాజాగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఫాంటసీ క్రికెట్ గేమ్ లో జాక్ పాట్ కొట్టాడు. డ్రీమ్ 11 యాప్ లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
పీలీభీత్ లోని హరిపుర్ కిషన్పుర్ గ్రామానికి చెందిన హషీమ్.. గత నాలుగేళ్లుగా డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా.. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ లో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు.
మ్యాచ్ లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్ ను ఎంపిక చేసుకున్న అతడు.. ఫాంటసీ గేమ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో డ్రీమ్ 11 ఫాంటసీలో రూ.కోటి గెలుచుకున్నాడు ఆ యువకుడు.
దీంతో హషీమ్ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. అయితే.. తన కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై ఏం మాట్లాడటం లేదు. హషీమ్, అతడి సోదరుడు కలిసి కారు కొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.