ఆస్తమా ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడే ఒక అనారోగ్య సమస్య. ఊపిరి అందకపోవడంతో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఊపిరితిత్తుల శ్వాసనాళాలు సంకోచంవలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఇది సాధారణంగా అలెర్జీ ప్రతిచర్యగా చెప్తారు. వాతావరణం, ఇబ్బందులు కలుగజేసే ప్రదేశాలు వివిధ రసాయనాలను సహా పలు కారణాలతో ఆస్తమా ఇబ్బంది పెడుతుంది.
Also Read:వీరుల వంశం..అందుకే ముర్ముకు పట్టం !
ఆస్తమా వచ్చిన రోగులు మానసికంగా బాధ పడకుండా తాము ఆస్తమాతో బ్రతకాలి అనే విషయాన్ని అలవాటు చేసుకుని జీవించాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం ఈ పీల్చుకునే మందులు ఆస్తమా సమస్య నుంచి బయట పడటానికి బాగా ఉపయోగపడతాయి. తక్కువ మొత్తం మందులతోనే ఆస్తమా నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఆస్తమా నుంచి కాపాడటానికి పోస్ట్పోనర్స్ కూడా వచ్చాయి.
అంటే భవిష్యత్తు లో రాబోయే ఆస్థమా అటాక్ ను ఇవి అడ్డుకుంటాయి. వైద్యుల సలహాతో వీటిని వాడుకోవచ్చు. భవిష్యత్తు లో జీన్స్ థెరపీ కూడా వస్తుంది అనే మాట వినపడుతుంది. అంటే జీన్స్ ను మార్చే వైద్యం వస్తుంది అని అంటున్నారు. వైద్యం ఏ విధంగా ఉన్నా సరే ఇన్ హీలర్ లు వాడితే ఇబ్బందులు అంతగా ఉండవు. అయితే ఈ ఆస్తమా విషయంలో దొంగ వైద్యులు కాస్త ఇబ్బంది పెడుతున్నారు.
ఆస్థమా అనేది సైకోసొమాటిక్ వ్యాధి… దాని అర్ధం దీనికి మానసిక మరియు శారీరక కారణాలు అని. మానసికంగా బలంగా లేకపోతే వాడిన మందులు అంతగా ప్రభావం ఉండదు. కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. ఆస్థమా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి… ఏమైనా లక్షణాలు పిల్లల్లో కనపడితే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా విషయంలో ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
Also Read:రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు…!