ఈ మధ్య కాలంలో మనకు ఆహారం విషయంలో ఒక పద్ధతి లేదనే మాట వాస్తవం. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తింటూ ఉంటాం. టైం పాస్ కోసం అని, ఇష్టం అని, తినడానికి ఏమీ లేవు అని ఏదోక కారణంతో తింటూనే ఉంటాం. తినేది కూడా ఒక పద్ధతి పాడు లేకుండా తింటూ ఉంటాం. దీని వలన నష్టాలే గాని లాభాలు అంటూ ఏమీ లేవు. రాను రాను జనాల్లో లెక్కలేని తనం కూడా పెరిగి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు.
మన చుట్టూ ఎన్నో మంచి ఆహార పదార్ధాలు ఉన్నా సరే… ఆరోగ్యానికంటే నాలుకకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. చిలకడ దుంపలు తినమని చెప్తే గ్యాస్ అని ఒకరు, పొట్ట బరువుగా ఉంటుందని మరొకరు చెప్తూ ఉంటారు. అదే పొటాటో చిప్స్ అయితే ఆరగించేస్తారు. అసలు చిలకడ దుంపల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలిసి చస్తేగా…? కొన్ని కొన్ని మనకు చాలా మేలు చేసేవి ఉన్నాయి.
చాలా రుచిగా ఉండే ఈ దుంపల్లో మంచి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది అని నిపుణులు చెప్తున్నారు. వీటిని తింటే కంటి చూపు మెరుగుపడటమే కాదు అండోయ్… వీటిని ఉడకబెట్టుకుని తింటే చర్మం కూడా నిగనిగలాడిపోతుంది. సంతానోత్పత్తి సమస్యలు కూడా ఈ దుంపలు పరిష్కరిస్తాయి. గొంతు చాతీ భాగాలలో ఎన్నో ఇన్ఫెక్షన్ లు దూరం చేస్తాయి. అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడే మొటిమల సమస్య పరిష్కరించడమే కాదు మంచి బాడీ కూడా పెరుగుతుంది.