అగ్నిపథ్ స్కీమ్ పై కేంద్రాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యంగా తీసుకున్న నిర్ణయానికి ప్రధాని మోడీ బాధ్యత వహించాలని, దానికి ఇప్పుడు పర్యవసానాలను ఎదుర్కోవాలని అన్నారు.
దయచేసి ఆర్మీ చీఫ్ వెనక దాక్కోవడం మోడీ మానేయాలని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ భవిష్యత్ గురించి యువతలో ఆగ్రహావేశాలు రేకెత్తడానికి మీరే కారణమంటూ మోడీపై ఆయన మండిపడ్డారు.
యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం వెనక మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభం, అధిక నిరుద్యోగితా రేటు, ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణాలు కారణాలుగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం నూతనంగా తీసుకు వస్తున్న అగ్నిపథ్ స్కీమ్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ కేవలం ఆయన స్నేహితుల మాటలు మాత్రమే వింటారని, మరెవరి మాటా వినరని ఆయన ట్వీట్ చేశారు.