హీరో, డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని ప్రతి సినిమాకి ఫాలో అవుతూ ఉంటారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కూడా ఆ సెంటిమెంట్ ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.
ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు డైరెక్టర్లు తన సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు. గతంలో త్రివిక్రమ్ ఒక ప్లేస్ లో కూర్చుంటే తనకు మంచి కథలు వస్తాయి అని అలా సక్సెస్ అవుతానని అదే నా సెంటిమెంట్ అంటూ చెప్పాడు.
అలాగే కొరటాలకు కూడా ఒక సెంటిమెంట్ ఉందట. అది కూడా హీరోలపైనే చూపిస్తాడట కొరటాల శివ. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కొరటాల శివ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలకు డైరెక్టర్ గా పనిచేశాడు. అలాగే రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిహారిక ఇష్యూపై స్పందించిన తల్లి పద్మజ… మాకు మా బావగారున్నారు!!
కొరటాల శివ సెంటిమెంట్ ఏంటంటే ఆయనకు బ్రౌన్ కలర్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన సినిమాల్లో నటించే హీరోలకు క్లైమాక్స్ లో బ్రౌన్ కలర్ షర్ట్ వేయిస్తాడట. ఈ కలర్ వల్ల తనకు బాగా కలిసి వస్తుందని నమ్ముతారట కొరటాల.
సర్కారుకు ప్రతివాడు చెల్లించాల్సిందే !
గతంలో కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి సినిమాలో కూడా క్లైమాక్స్ ఫైట్ కి ప్రభాస్ బ్రౌన్ కలర్ షర్ట్ లో కనిపిస్తాడు. అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఆచార్యలో చిరంజీవి కూడా బ్రౌన్ కలర్ లో కనిపించాడు.