అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పటి హీరోయిన్ బేబీ షామిలి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 1990 వ ఏట తెలుగు, తమిళ, మలయాళంలో ఎన్నో చిత్రాలలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె తమిళంలో నటించిన అంజలి తెలుగులో కూడా అప్పట్లో వచ్చింది. ఈ చిత్రానికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత నాగార్జున కిల్లర్, జోకర్ చిత్రాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ఓయ్ సినిమా లో సిద్ధార్థ పక్కన హీరోయిన్ గా నటించింది.
నాల్గవ పెళ్లి చేసుకోబోతున్న నరేష్
అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత అంటే తొమ్మిదేళ్ల తర్వాత 2018లో అమ్మమ్మగారిల్లు చిత్రంలో నాగ శౌర్య సరసన నటించింది. ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
దీనితో తాను హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు బైబై చెప్పింది. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది బేబీ షామిలి.
ఆ హీరో ఓకే చెప్పి ఉంటే…కేజిఎఫ్ రిజల్ట్ ఏంటో!!