సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చెప్పవే చిరుగాలి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. గిరిబాబు, సత్యనారాయణ, సునీల్, సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే హీరోయిన్ గా అభిరామి నటించింది.1995లో కెరీర్ స్టార్ట్ చేసింది అభిరామి. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు. చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిరామి ఉన్నత చదువుల కోసం 2004లో యూఎస్ వెళ్ళింది. ఆ తర్వాత 2013న ఇండియాకి వచ్చింది.
తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమా కన్నా ముందు థాంక్యూ సుబ్బారావు చార్మినార్ సినిమాల్లో నటించింది. అలాగే లేటెస్ట్ గా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రను పోషించింది.
భయంకరమైన వ్యాధులతో పోరాడి గెలిచిన హీరోయిన్స్ వీళ్ళే!!
మలయాళం లో న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్ , మేఘసందేశం వంటి సినిమాలు చేసింది.
రక్తకన్నీరు, లాలి హాడు వంటి కన్నడ సినిమాల్లో నటించిన అభిరామి మిడిల్ క్లాస్ మాధవన్ , చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం, సమస్థానం వంటి తమిళ సినిమాలలో కూడా నటించింది.
ఆడవాళ్లు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ? వెనుక ఉన్న కథ ఇదే !
నటన పరంగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 సినిమాలో హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ డబ్బింగ్ చెప్పారు. అయితే ప్రస్తుతం అభిరామి ఎంతగానో మారిపోయారు. ఆమెను చూసిన వారు ఎవరూ గుర్తుపట్టలేక పోతున్నారు.