సూపర్ హీరోలు అంటే సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం. అంటే సూపర్ హీరోలను పోలిన శరీరాకృతి కలిగిన వారు కూడా మనకు బయటి ప్రపంచంలో అసలు దాదాపుగా కనిపించరనే చెప్పవచ్చు. కానీ నిజానికి కొన్ని దేశాల్లో అలాంటి చిత్రమైన ఆకృతులు కలిగిన వారు కూడా ఉన్నారు. సూపర్ హీరోల్లా కాకపోయినా ఒక మోస్తరుగా ఆకట్టుకునే దేహాలు కలిగిన వారు కూడా ఉన్నారు. మరి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సజబ్ ఘరిబి
హాలీవుడ్ హల్క్ తెలుసు కదా. చూసేందుకు ఇతను కూడా అచ్చం హల్క్ లాగే ఉంటాడు. ఇతనిని పర్షియన్ హల్క్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో ఈయనకు 1 లక్ష ఫాలోవర్లు ఉన్నారు. బరువు సుమారుగా 175 కిలోలు ఉంటాడు.
2. టామ్ స్టానిఫోర్డ్
ఈయనకు 12 ఏట నుంచి చిత్రమైన వ్యాధి మొదలైంది. దాని కారణంగా ఈయన శరరీంలో కొవ్వు నిల్వ కాదు. దీంతో సన్నగా కనిపిస్తాడు. ఆ వ్యాధిని ఎండీపీ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ వ్యాధికి చికిత్స చేయలేకపోయారు.
3. బ్రాక్ బ్రౌన్
ప్రపంచంలో 18 ఏళ్ల వయస్సులో అత్యంత ఎత్తు కలిగిన యువకుడిగా ఇతను పేరుగాంచాడు. ఇతను ఏడాదికి 6 ఇంచుల ఎత్తు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇతని ఎత్తు ప్రస్తుతం 7 అడుగుల 8 ఇంచులు. దీని వల్ల ఇతను అనేక ఇబ్బందులు పడుతున్నాడు.
4. మిషెల్ కోబ్‌కె
ప్రపంచంలోనే అత్యంత సన్నదైన నడుము ఉండాలని ఈమె కల. ఈమె నడుం ప్రస్తుతం 16 ఇంచులు. ఇంకో ఇంచు తగ్గాలని ఆమె ఆలోచన. అందుకు ఈమె రాత్రి పూట కూడా నడుంకు దుస్తులు టైట్‌గా ధరించి నిద్రిస్తుంది. దీంతో ఈమెకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ ఆమె లెక్క చేయకుండా తన కలను సాధించుకునేందుకు యత్నిస్తోంది.
5. అమూ హడ్జీ
ఇరాన్‌లోని డెజ్‌గా అనే ప్రాంతంలో ఇతను ఉంటాడు. వయస్సు 85 ఏళ్లు. 65 ఏళ్ల నుంచి స్నానం చేయలేదు. జంతువుల పేడతో పొగతాగుతాడు. శుభ్రంగా ఉంటే అనారోగ్యం వస్తుందట. అందుకని ఇతను స్నానం చేయడం లేదు.
6. ముస్తఫా ఇస్మాయిల్
కార్టూన్ క్యారెక్టర్ పొపొయె తెలుసు కదా. కండలు బాగా లావుగా ఉంటాయి. సరిగ్గా ఆ క్యారెక్టర్‌ను పోలి ఇతను ఉంటాడు. అంత లావుపాటి కండలు కలిగి ఉన్నందుకు గాను ఇతనికి గిన్నిస్ రికార్డు కూడా లభించింది. ఇతను ఉండేది ఈజిప్టులో. ఇతని కండల చుట్టుకొలత ఏకంగా 31 ఇంచులు.
7. సమ్ మింగ్‌మింగ్
ఇతనిది చైనా. ఎత్తు 7 అడుగుల 9 ఇంచులు. ఫొటో చూస్తేనే మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఇతను ఎందులో ఫేమస్సో. అయితే ఎత్తు అంతలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎత్తయిన వ్యక్తి మాత్రం కాదు. కానీ ఎత్తయిన బాస్కెట్ బాల్ ప్లేయర్. దీంతో గిన్నిస్ రికార్డు సాధించాడు.
8. వాంగ్ ఫాంగ్
ఈమె వయస్సు 34 ఏళ్లు. ఉంటున్నది చైనాలో. ఈమెకు పుట్టుకపోతే చిత్రమైన వ్యాధి వచ్చింది. దీంతో ఆమె పాదాలు వెనక్కి పెరిగాయి. దీని వల్ల ఆమె నడవలేకపోయింది. అయినప్పటికీ ఈమె తనకు అంగ వైకల్యం ఉన్నవారికి ఇచ్చే పెన్షన్‌ను వద్దనుకుంది. సాధారణంగానే అందరిలా ఈమె జీవిస్తోంది.
9. గెర్కరీ బ్రాకో బ్లెకెట్
ఈమెది ఫ్లోరిడా. ఈమె నాలుక చాలా పొడవుగా ఉంటుంది. దాంతో ఆమె తన మోచేతిని టచ్ చేస్తుంది. నాలుకతో కళ్లను కూడా అందుకోగలదు. అయితే ప్రపంచంలో అత్యంత పొడవైన నాలుక ఉన్న వ్యక్తి నాలుక పొడవు 3.97 ఇంచులు కాగా ఈమె నాలుక పొడవు 4.48 ఇంచులు. దీంతో ఈమె గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేందుకు యత్నిస్తోంది.
10. ఒలివియర్ రిచ్‌టర్స్
ఇతన్ని ది డచ్ జియాంట్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బాడీ బిల్డర్‌గా పేరు గాంచాడు. ఇతని ఎత్తు 7.2 అడుగులు. బరువు 135 కిలోలు. ఇతను డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చేయడంతోపాటు సినీ నటుడిగా రాణించాలని కలలు కంటున్నాడు.