ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు టీమ్ లో ఉన్న ఏ యంగ్ స్టర్ పై ప్రెషర్ లేదని.. ఉండబోదని..ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లకు ఉందన్నారు రోహిత్. స్పష్టమైన గేమ్ ప్లాన్ ఉండడంతో ఒత్తిడి అనేది దరి దాపుల్లోకి కూడా రాదని శర్మ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
తన పై ఎప్పుడు అంచనాలుంటాయని.. ఎందుకంటే తాను చాలా కాలం నుంచి ఆడుతుండడంతో అభిమానులు ఆమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవడం సాధారణమన్నారు రోహింత్ శర్మ. వాటి గురించి పెద్దగా ఆందోళన చెందనని స్పష్టం చేశారు. ఐపీఎల్ లోనే కాదు తాను ఏ ఆట ఆడినా తనతో పాటు టీం పై అంచనాలు కామన్ అన్నారు.
ఎక్కడైనా గెలువడమే ముఖ్యమని..ట్రోఫీ గెలవడం కోసం మా వంతు కృషి చేస్తామన్నారు. ఇక ఒత్తిడి గురించి ఆలోచిస్తే.. మరింత ప్రెషర్ కు లోనవుతామని చెప్పారు. టీమ్ లో ఉన్న యంగ్ స్టర్స్ బ్రేవిస్, తిలక్ వర్మతో పాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ పై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు కెప్టెన్ రోహిత్. వాళ్లకు స్పష్టమైన గేమ్ ప్లాన్ ఉంటుందన్నారు.
సహజంగా ఫస్ట్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారని.. కాబట్టి వాళ్ల నుంచి నేను ఏం ఆశిస్తున్నానో ప్లేయర్లకు బాగా తెలుసన్నారు. వాళ్ళను కాపాడుతూ మంచి పెర్ఫామెన్స్ ను రాబట్టడమే తన బాధ్యత అని మీడియా ముందు రోహిత్ శర్మ అన్నారు.అయితే డొమెస్టిక్ క్రికెట్ కు కొనసాగింపు మాదిరిగా ఐపీఎల్ ను భావించాలని కుర్రాళ్లకు హిట్ మ్యాన్ సలహా ఇచ్చాడు.