హైదరాబాద్ కంపెనీపై ఐటీ మరోసారి కొరడా ఝులిపించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీపై దేశవ్యాప్తంగా ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. కిలోల కొద్ది బంగారం, వేలాది డాక్యుమెంట్లు సీజ్ చేయగా… ఆ తర్వాత దాదాపు 3 వేల కోట్ల పైచిలుకు హవాలా డబ్బును రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
తాగుబోతుల తెలంగాణ చేసినవ్ దొరా!
అయితే, ఆ సోదాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి 170కోట్ల మేర నల్లధనం ఇచ్చినట్లు వెల్లడైంది. దీంతో దీనిపై సమాధానం చెప్పాలని ఏఐసీసీకి ఐటీ శాఖ తాజాగా నోటీసులు అందించింది. ఈ 170కోట్ల డబ్బు కూడా హవాలా మార్గంలోనే వచ్చిందని ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు…?
ఏఐసీసీకి అందిన నోటీసుల్లో… అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఆ హైదరాబాద్ కంపెనీ లెక్కచూపకుండా ఆ డబ్బు ఎందుకు ఇచ్చింది, ఆ డబ్బును ఏఐసీసీ తన లెక్కల్లో చూపిందా…?, ఎక్కడ ఖర్చు చేశారు అన్న వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.