ఎప్పుడూ వినూత్నంగా నిరసన తెలుపుతూ, తన డివిజన్ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం-అధికారుల దృష్టికి తీసుకెళ్లే హయత్ నగర్ కార్పోరేటర్ సామ తిరుమలరెడ్డి తనదైన శైలిలో నిరసర తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా గ్రీన్ మెడోస్ హైవే అప్రోచ్ రోడ్ సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టి తవ్వేసి అలాగే వదిలేశారు. దాంతో నిన్న కురిసిన వర్షానికి నీరంతా రోడ్డుపైనే నిలిచిపోయింది. ఎక్కడ గుంత ఉందో కూడా కనపడకుండా… చెరువుగుంటలా తయారైంది. దీంతో అధికారులు దీనిపై స్పందించకపోవటంతో, వెంటనే అధికారులు రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయించాలని టీఆర్ఎస్ కార్పోరేటరే నిరసనకు దిగారు.
అయితే… ఇది ఈయనకు కొత్తేమీ కాదు. తన డివిజన్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా… అధికారులు స్పందించకుంటే ఇలా నిరసన తెలపటం సామ తిరుమల రెడ్డి స్పెషల్.