విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు ఈ పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు. తన బ్యాట్ తో ఎన్నో సెంచరీలు కొట్టి కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కింగ్ కోహ్లీ ఓ బ్యాడ్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా నాలుగు సార్లు ఒకే బౌలర్ కి తన వికెట్ ను సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ కు నాలుగుసార్లు కోహ్లీ తన వికెట్ ను సమర్పించుకున్నాడు.
ఈ సిరీస్ లో మూడు సార్లు కూడా కోహ్లీని హేజిల్‌వుడే అవుట్ చేశాడు. గతంలో ఆసీస్ జట్టు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కూడా విరాట్ ను హేజిల్‌వుడే అవుట్ చేశాడు. దీంతో కోహ్లీని వరుసగా నాలుగు సార్లు అవుట్ చేసిన మొదటి బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు బౌల్డ్, జునైద్ ఖాన్ ,కేన్ రిచర్డ్సన్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేశారు. వారి రికార్డును బద్దలు కొడుతూ కోహ్లీని నాలుగవసారి అవుట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు హేజిల్‌వుడ్.