హెచ్.సీ.ఏ అద్యక్షుడు, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ గులాబీ గూటికి చేరబోతున్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్.సీ.ఏ ఎన్నికల్లో గెలుపు తర్వాత సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు అజారుద్దీన్. దీంతో అజారుద్దీన్ కాంగ్రెస్‌ను వీడనున్నారన్న ప్రచారం జోరందుకుంది. పైగా… అజహరుద్దీన్ గెలుపు కోసం కేటీఆర్ కృషి చేశారని మాజీ ఎంపీ వివేక్ కూడా ఆరోపించారు. దాంతో… పార్టీ మారుతారని అంతా భావిస్తున్నారు. శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమక్షంలో అజారుద్దీన్ గులాబీ కండువా కప్పుబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.