మధురై నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తూ.. అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు సిబ్బంది.
బాధిత ప్రయాణికుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇక డీటైల్స్ లోకి వెళితే.. మధురై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో 60 ఏండ్ల వృద్ధుడు ప్రయాణిస్తున్నాడు. అయితే అతను అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రక్తం కక్కున్నాడు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది.. ఇండోర్ లోని దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని ల్యాండ్ చేశారు.
బాధిత వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని నోయిడాకు చెందిన అతుల్ గుప్తాగా గుర్తించారు. అయితే గుప్తా గుండె సంబంధిత వ్యాధితో,బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుప్తా మృత దేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.