సీనియర్ ఎన్టీఆర్….ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సినీ హీరో గా, రాజకీయ నాయకుడిగా సంచలనం సృష్టించిన వ్యక్తి. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ లా ఉంటాడు అనే వారు అప్పట్లో. అయితే ఈయన సినీ కెరీర్ లో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అడవి రాముడు, యమగోల, లవకుశ, మాయాబజార్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఒకరి పాత్ర ఉంటుంది అలా ఎన్టీఆర్ సక్సెస్ వెనుక కూడా చాలా మంది పాత్ర ఉంది. ముఖ్యంగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు పాత్ర చాలా ఎక్కువ.
ఎన్టీఆర్ కోసం అప్పట్లో కృష్ణ ఇచ్చిన ప్రకటన గురించి తెలుసా ?
ఎన్టీఆర్ త్రివిక్రమరావు రామలక్ష్మణులతో కలిసి ఉండేవారట. వయసు పరంగా మూడేళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ తమ్ముడంటే ఎంతో అభిమానంతో ఎన్టీఆర్ ఉండేవారట. ఈ ఇద్దరిలో ఒకరు ఏదైనా విషయాన్ని ఆలోచిస్తే మరొకరు దానిని ఆచరణలో పెట్టేవారట. అంతలా ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఉండేదట. ఎన్టీఆర్ బీఏ వరకు చదువుకోగా త్రివిక్రమరావు మాత్రం చదువుకోలేదు.
ఇకపోతే ఎన్టీఆర్ కు సినిమాలలో అవకాశం వచ్చిన తర్వాత వెళ్లాలా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను త్రివిక్రమరావు ప్రోత్సహించారట. ఎన్టీఆర్ కు తొలినాళ్లలో అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఎంతో సపోర్ట్ గా త్రివిక్రమరావు నిలిచారట. ఆస్తిలో తన వాటాను కూడా తమ్ముడికి ఇచ్చి తమ్ముడు పెళ్లి కి ఇబ్బందులు ఎదురు కాకుండా ఎన్టీఆర్ చూసుకున్నారట. తన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టే వారో తన తమ్ముడు కుటుంబానికి కూడా అంతే ఖర్చు చేసేవారట సీనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ 1996లో చనిపోగా త్రివిక్రమరావు 1998 లో చనిపోయారు.
Advertisements
అలా మొదలైన నయన్ విఘ్నేష్ ల ప్రేమ కథ