చికెన్ ఉద్దెర ఇవ్వలేదని ఓ వ్యక్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా చికెన్ షాపు సూపర్ వైజర్ ఇంటి పై దాడి చేశాడు. అక్కడ పార్కింగ్ చేసిన బైక్ ను ధ్వంసం చేశాడు. బైక్ పై ఓ కత్తితో పాటు ఓ మెమరీ కార్డును ఉంచాడు. అందులో అంతుచూస్తానంటూ ఓ ఆడియో రికార్డ్ చేసి ఉంది.
వరంగల్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాశిబుగ్గ ప్రాంతంలో ఉండే మధుకర్, అలంకర్ జంక్షన్ లోని చికెన్ సెంటర్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి షాపు దగ్గరకు వచ్చి చికెన్ ఉద్దెరకు ఇవ్వమని అడిగాడు.
ఇక ఎప్పుడూ చూడని ముఖం కావడంతో మధుకర్ చికెన్ ఇవ్వనన్నాడు. దీంతో ఆ వ్యక్తి అర్థరాత్రి మధుకర్ ఇంటికి వచ్చాడు. అతని ఇంట్లో పార్క్ చేసి ఉన్న టూవీలర్ ను ధ్వంసం చేసి.. నానా హంగామా చేశాడు. దీంతో మధుకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.