స్మార్ట్ ఫోన్ విషయంలో చాలా మంది హై ఎండ్ వాడాలి అని భావిస్తూ ఉంటారు. అయితే హై ఎండ్ ఫోన్స్ విషయంలో చాలా మందికి ఆర్ధిక సమస్యలు ఉండటంతో కొనలేని పరిస్థితిలో ఉంటారు అనే మాట వాస్తవం. అందుకే కొందరు అప్పులు చేయడం మరికొందరు దొంగతనాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి చేసిన దొంగతనం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది.
అసలు ఏంటీ అనేది ఒక ట్విట్టర్ యూజర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే… ట్విట్టర్ యూజర్ దేబయన్ రాయ్ ఇటీవల ఒక సంఘటనపై ఒక ట్వీట్ చేసారు. సెక్టార్ 52 నోయిడా మెట్రో స్టేషన్‌లో డెబయన్ తన ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉండగా బ్లాక్ మాస్క్ ధరించిన ఒక వ్యక్తి తన ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. ఆ సంఘటన తర్వాత తన ఫోన్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసినా సరే ఫోన్ మాత్రం దొరకలేదు.
కాని ఆ దొంగ మాత్రం తిరిగి వెనక్కు పరుగు తీసి ఫోన్ ని అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. “భాయ్ ముజే లగా వన్ ప్లస్ 9 ప్రో మోడల్ హై” (ఇది వన్‌ప్లస్ 9 ప్రో మోడల్ అని నేను అనుకున్నాను) అన్నారు. ఇలా చెప్పి, పరికరాన్ని నేలమీద పడేసి, మళ్ళీ పారిపోయాడు.” అని పంచుకున్నారు. ఇంతకు రాయ్ ఫోన్ ఏది అంటే… గెలాక్సీ ఎస్ 10 ప్లస్. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో కింద కామెంట్స్ లో చెప్పారు.