పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈలలు గోలలతో థియేటర్స్ దద్దరిల్లి పోతాయి. టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ను స్క్రీన్ పై చూసేందుకే ఇష్టపడుతూ ఉంటారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయటం ఇండస్ట్రీ లో కామన్. పవన్ కళ్యాణ్ కూడా అలానే ఒక హీరో చేయాల్సిన సినిమాని చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు… బద్రి.
ఇలా చేస్తే… వచ్చేవాడు నీ కూతుర్ని వదిలి నిన్ను చేసుకుంటాడు!!
ఈ సినిమా కథను మొదట పూరి జగన్నాథ్ వేరొక హీరోని దృష్టిలో పెట్టుకొని రాశారట. అతను మరెవరో కాదు అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడు అక్కినేని నాగార్జున. కానీ నాగార్జున నో చెప్పటం తో పవన్ తో తీశాడు. 2000 సంవత్సరం లో రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యూత్ లో కూడా పవన్ కు క్రేజ్ తీసుకువచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 45 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇందులో రేణు దేశాయ్ అమీషా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.
అలాగే పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్ ఇద్దరి కెరీర్ కి కూడా ఈ చిత్రం ప్లస్ గా నిలిచింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు పూరి జగన్నాథ్ కథ చెప్పేందుకు చోటా కె నాయుడు ద్వారా అప్రోచ్ అయ్యారట. ఆ విధంగా బద్రి తెరకెక్కటంలో చోటాకే నాయుడు కీ రోల్ పోషించాడు.