బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన దగ్గర బార్లీ గింజలను ఎక్కువగా ఉపయోగించరు కానీ విదేశాల్లో ఎక్కువగా ఆహారంలో భాగంగా బార్లీ గింజలు తీసుకుంటారు. మన దేశంలో తక్కువ విస్తీర్ణంలో బార్లీ పండించడం వల్ల వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బార్లీ గింజల లో ఎలాంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లీ గింజల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శక్తినిచ్చే ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, అనేక విటమిన్లు ఖనిజలవణాలు బార్లీ గింజల లో ఉంటాయి. అంతేకాకుండా బార్లీ గింజలలో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది. లావుగా ఉన్నవారు సన్నబడటానికి బార్లీ గింజలను తినడం మంచింది. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా ఇందులో ఉండే గ్లూకాన్ రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. అంతే కాకుండా బార్లీ గింజల్లో ఉండే గ్లుకాన్ పెద్దపేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక బార్లీ గింజలను ఇతర ఆహార పదార్థాలతో పాటు బార్లీ జావ కూడా చేసుకుని తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.