తక్కువ ధరలో లభించే డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూర కూడా ఒకటి. ఖర్జురా ధర మిగతా ఫ్రూట్స్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. పది రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది. అంతే కాకుండా కేజీ చొప్పున కొనుకున్నా తక్కువ ధరకే వస్తాయి. ఇక తక్కువ ధరలో లభించినప్పటికీ ఖర్జూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఖర్జూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ ఖర్జూర పండ్లను తినడం వల్ల ఆ సమస్య తగ్గే అవకాశం ఉంది. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు వ్యాయామం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది. కానీ వారికి వ్యాయామం చేసేందుకు కూడా సరిపోయేంత శక్తి ఉండదు.
అలాంటివారు ఖర్జూరాలను తినడం వల్ల శక్తి లభిస్తుంది. దాంతో వ్యాయామం చేయవచ్చు. ఖర్జూర లలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్ లు మంట, వాపు అలాగే ఇన్ఫెక్షన్లను మరియు రక్తస్రావం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఖర్జూర తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఖర్జూరాలను తినడం వల్ల ఎసిడిటీ సమస్య దూరమవుతుంది.