కుంకుమ పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా కుంకుమపువ్వు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. కుంకుమ పువ్వు తో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కుంకుమపువ్వు తింటే పుట్టబోయే పిల్లలు ఎర్రగా పుడతారని మాత్రమే అనుకుంటారు. కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు. కుంకుమ పువ్వు మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శృంగార సామర్ధ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా గర్భిణీలు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే కుంకుమ పువ్వు ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి పోతుంది. అంతే కాకుండా మంచి నిద్ర పట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణీల్లో హార్మోన్ల మార్పు రావడం వల్ల మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అయితే ఆ మూడ్ స్వింగ్స్ ను రాకుండా కుంకుమపువ్వు ఎమోషన్స్ ను కంట్రోల్ చేయగలుగుతుంది.
కొంత మంది గర్భిణీలు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతూ ఉంటారు. అయితే తరచూ కుంకుమపువ్వును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. దాంతో డెలివరీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. చాలా మంది గర్భిణీలు అలర్జీల సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ అలర్జీలను దూరం చేయడానికి కూడా కుంకుమ పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.