దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా హెల్త్ వర్కర్లు కరోనా వైరస్ సోకిందని కేంద్రం వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా 18 శాతం మంది హెల్త్ వర్కర్లు ఈ మహమ్మారి బారినపడ్డారని తెలిపింది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో 16 శాతం, ఢిల్లీలో 14 శాతం, కర్ణాటకలో 13 శాతం, పుదుచ్చేరిలో 12 శాతం, పంజాబ్‌లో 11 శాతం మంది హెల్త్ వర్కర్లకు కరోనా సోకిందని కేంద్రం తెలిపింది.
కరోనా కేసులు, మరణాల నియంత్రణలో అందరికంటే మెరుగ్గా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది.కానీ తెలంగాణలో అత్యధికంగా హెల్త్ వర్కర్లు కరోనా బారినపడటం చర్చనీయాంశంగా మారింది.