మన వంటింట్లో దొరికే కూరగాయలు మరియు ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే అవేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతికూరగాయలో మన శరీరానికి అవసరమైన పోషకాలు మూలకాలు ఉంటాయి. అలాగే మనం ఎక్కువగా సువాసన కోసం బిర్యాని మరియు కూరలలో వేసుకునే పుదినా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అందువల్లే వాటిని వంటల్లో వేసుకుంటాం. మంచి వాసనతో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పుదీనా సహాయపడుతుంది.
అంతేకాకుండా జ్యూసులు, టీ లలోనూ దీనిని వేసుకుంటారు. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో ఉండే ఆహార వ్యర్థాలు బయటకు పంపించబడతాయి. మనం టాబ్లెట్ లు వేసుకున్న తరవాత మన శరీరంలో కొన్ని రసాయనాలు అలాగే ఉండిపోతాయి. అయితే ఆ వ్యర్థపదార్థాలను తీసి వేసే గునం పుదీనాకు ఉంటుంది.
ఒక గ్లాసులో కొంత నీరు పోసి అందులో పుదీనా ఆకులు మరియు నిమ్మకాయ ముక్కలను వేసి ఒక రెండు గంటల పాటు ఉంచాలి. అలా ఉంచిన నీటిని మెల్లి మెల్లిగా తాగితే అలసట పూర్తిగా తొలగిపోతుంది. వెంటనే రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది. కూల్ డ్రింక్స్ తాగితే వచ్చే ఉత్తేజం కంటే ఎక్కువ ఉత్తేజం వస్తుంది.