తెలంగాణలో వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుంది. ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్ తప్పవని అబద్ధమని నిరూపితం అయ్యింది. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా సేఫ్ గా ఉన్నారు. ఏపీలోని విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న రాధా అనే హెల్త్ వర్కర్ అస్వస్థకు గురైనప్పటికీ ఆమె ఉదయం నుండి ఏమీ తినకపోవటంతో పాటు వ్యాక్సిన్ పై ఉన్న భయంతోనే ఆమె కళ్లు తిరిగినట్లు అయ్యిందని వైద్యులు తేల్చారు. ఇప్పుడామే సురక్షితంగా ఉన్నారు.
తాజాగా… సంగారెడ్డి జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్‌ఎం సంగీతకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని వైద్యులకు సంగీత చెప్పారు. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే, లక్షల్లో ఒకరికి ఇలాంటివి రిపోర్ట్ అవుతాయని… భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. తనకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.