సమ్మెపై ‘ఈగో’లకు వెళ్లొద్దు, ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వానికి, ఆర్టీసీ యూనియన్‌లకు సూచించింది హైకోర్టు. ఇరు వర్గాలు చర్చలకు వెళ్లాలని, పరిష్కారంతో రావాలంటూ నేటికి కేసును వాయిదా వేసింది. చర్చల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని, వెంటనే ఆర్టీసీకి కొత్త ఎండీ నియామకం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కానీ ప్రభుత్వం మాత్రం అంతకుముందున్న ధోరణినే కొనసాగించింది. చర్చలకు ఆర్టీసీ యూనియన్లు మొగ్గుచూపినా.. ప్రభుత్వం మాత్రం నో చెప్పింది. అప్పటికే చెప్పిన సెల్ఫ్ డిస్మిస్ మాటకే కట్టుబడి ఉండటంతో… హైకోర్టు ఈరోజు ఎలా స్పందిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. కోర్టులో బలంగా వాదనలు వినిపించాలని… సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీచేయగా… కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోయింది.
ఇటు ఆర్టీసీ యూనియన్ నాయకులు మాత్రం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. కోర్టులు చెప్పినా వినని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని, ఆయనకు కోర్టులో చీవాట్లు ఎదురైతే కానీ దారికి రారంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు.
దీంతో… కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సమ్మెపై డైరెక్షన్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.