కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు వారాలుగా గుండె ఆపరేషన్లు నిలిచిపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ప్రైవేటులో వైద్యం చేయించుకునే స్తోమతలేకే ప్రభుత్వాసుపత్రికి వస్తే… ఇక్కడ ప్రాణం పోయేలా ఉన్న ఆపరేషన్లు చేయరా అంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఆపరేషన్లు ఎందుకు నిలిచిపోయాయని ఆరా తీస్తే… పర్ఫూజనిస్ట్‌కు జీతాలు ఇవ్వటం మానేయటంతో… జీతం కోసం ఇంకా ఎదురు చూడలేక తను ఉద్యోగం మానేశాడు. ఉన్న ఒక్కరు ఉద్యోగం మానేయటంతో… ఆసుపత్రిలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. వైద్యాధికారులు మాత్రం ఇంకా దీనిపై స్పందించకపోవటంతో… రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరూ పట్టించుకోరా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.