బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, ప్రముఖ నటి ఆలియా భట్ తండ్రి మహేశ్ భట్ కు హార్ట్ సర్జరీ జరిగింది. డిసెంబర్ నెలలో చెకప్ కోసం వెళ్లగా యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహేశ్ భట్ హార్ట్ సర్జరీ ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు రాహుల్ భట్ తెలిపారు.
ఈ వారం మొదట్లో మహేశ్ భట్ ఆసుపత్రిలో చేరినట్లు రాహుల్ తెలిపాడు. గుండె శస్త్ర చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నారని పేర్కొన్నాడు.బాగానే కోలుకుంటున్నారని, ఇంతకు మించి వివరాలు ఏమీ చెప్పలేనని తెలిపాడు.
అయితే, గత నెలలో ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లగా.. త్వరగా హార్ట్ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. మహేశ్ భట్ 26 సంవత్సరాల వయసులో తొలిసారిగా దర్శకత్వం చేశారు.
‘మంజిలీన్ ఔర్ భీ హై’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ‘సారాంశ్’, ‘ఆషికి’, ‘జెహెర్’, ‘జిస్మ్’ తదితర చిత్రాలను సైతం నిర్మించారు. ‘రాజ్’’, ‘దుష్మన్’, ‘ఫుట్‌పాత్’ తదితర చిత్రాలకు రచయితగానూ పని చేశారు.