అత్యవసరంగా తరలించాల్సిన గుండె కోసం హైదరాబాద్ మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. తొలిసారిగా చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. డాక్టర్ గోఖలే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. ఆ గుండెను ఎల్.బి నగర్ కామినేని ఆసుపత్రి నుండి తరలించాల్సి ఉంది.
అయితే, వేగంగా గుండెను తరలించాలంటే… హైదరాబాద్ ట్రాఫిక్ లో అంత సులువైన పని కాదు. దీంతో ఇందుకు హైదరాబాద్ మెట్రో సంస్థ సహాయం తీసుకున్నారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు నాన్‌స్టాప్ మెట్రోలో గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌డెడ్ కావడంతో గుండెను దానం చేసేందుకు రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో మరో ప్రాణాన్ని నిలిపేందుకు వైద్యులు గుండెను తరలించారు.