కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీలో కరోనా ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి మాస్కులు లేకుండా బయట విచ్చలవిడిగా తిరుగుతున్న వారిపై పోలీసులు దృష్టిపెట్టారు. కేంద్రం సూచించినట్లు భారీగా ఫైన్ విధిస్తున్నారు.
కేవలం ఒక్కరోజే ఏపీ పోలీసులు మాస్కులు పెట్టుకోవటం లేదని… 19వేల మందిపై ఫైన్ విధించారు. వారి వద్ద నుండి 17లక్షల రూపాయలు వసూలు చేశారు. మాస్కులు ధరించని వారికి కనీసం 250రూపాయల నుండి 500రూపాయల వరకు ఫైన్ వసూలు చేస్తున్నారు.
ఓవైపు ఫైన్ విధిస్తూనే… ప్రజల్లో చైతన్యం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఏపీ డీజీపీ పోలీసులను ఆదేశించారు. ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.