ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఉడ్ కాంప్లెక్స్ వద్ద ఈ పార్కింగ్ స్థలంలో 20 ప్రైవేట్ బస్సులు పార్క్ చేసి ఉన్నాయి. పార్కింగ్ చేసిన ప్రైవేటు బస్సులకు మంటలు అంటుకుని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 బస్సులు పూర్తిగా దగ్దం అయ్యాయి.
దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
ఆ బస్సులు కావేరి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. మంటలు చెలరేగడానికి పూర్తి వివరాలు తెలయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.