కేవలం బంగారాన్ని తరలించడానికే హైదరాబాద్ చేరుకున్న 23 మంది సుడాన్ మహిళల ఎత్తులను చిత్తు చేశారు శంషాబాద్ కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని షూ, పాదాల కింద, బట్టల మధ్యలో దాచి తరలించే ప్రయత్నం చేసింది ఈ కిలాడీ లేడీ గ్యాంగ్. అయితే కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అడ్డంగా బుక్ అయింది.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి ఓ గ్రూప్ గా 23 మంది మహిళా ప్రయాణీకులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కస్టమ్స్ అధికారులను కన్ఫ్యూజ్ చేసి బంగారాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్యాంగ్ పై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలగడంతో వారిని క్షుణ్ణంగా పరిశీలించే సరికి గుట్టు కాస్త రట్టైంది.
వారిలో నలుగురి వద్ద అక్రమ బంగారాన్ని గుర్తించారు అధికారులు. బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే యత్నం చేశారు ఈ లేడి కిలాడీలు. అయితే వీరి దగ్గర్నుంచి 8 కోట్లు విలువ చేసే 14.4 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.